గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గరిడేపల్లి మండలం రాయినిగూడెం సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ ఎంపికయ్యారు. రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాయితి ఆశాదీప్ రెడ్డి సోమవారం నియామకపత్రం అందజేశారు. జిల్లాలోని సర్పంచులను సమన్వయం చేసుకుంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
